అమెజాన్ పై ఫిర్యాదు చేసిన సెల్లర్స్

అమెజాన్ పై ఫిర్యాదు చేసిన సెల్లర్స్

అన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీపై దాదాపు 2వేల మంది సెల్లర్స్ యాంటీ ట్రస్ట్ కేసు ఫైల్ చేశారు. కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా-CCIలో ఈ ఫిర్యాదు చేశారు. వీరంతా కూడా అమోజాన్ లో ఉత్పత్తులు విక్రయిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలను ప్రోత్సహిస్తూ అధిక డిస్కౌంట్లు ఇస్తూ తమ వ్యాపారాలు నష్టపోయేలా చేస్తువదని ఫిర్యాదులో పేర్కొన్నాయి.

తమ ఒప్పందానికి భిన్నంగా అమోజాన్ వ్యవహరిస్తుందని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే అమోజాన్ మాత్రం నిబంధనలకు అనుగుణంగానే తాము అమ్మకాలు సాగిస్తున్నామని చెబుతోంది. తమ సంస్థలో ఎవరైనా రిజిస్టర్ కావొచ్చని తెలిపింది. వేదిక మాత్రమేనని.. ఆఫర్లు, డిస్కౌంట్లకు తమకు సంబంధం లేదని చెబుతోంది.

అటు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సెల్లర్ క్లౌడ్ టెల్ కంపెనీ కూడా నిబంధనలకు అనుగుణంగా అమెజాన్ లో ఉత్పత్తులు విక్రయిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాదం CCI పరిధిలో ఉంది. కేసు తీసుకుని విచారణకు ఆదేశించవచ్చు లేదా.. డిస్మిస్ చేయవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story