తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం..

తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం..
కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం దాదాపు అయిదు నెలలుగా మూసివేయబడిన అనంతరం ఈ రోజు

కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం దాదాపు అయిదు నెలలుగా మూసివేయబడిన అనంతరం ఈ రోజు నుంచి భక్తుల కోసం తిరిగి ప్రారంభించబడింది. "ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి దీపారాధన సమయం వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది" అని ఆలయం మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. దర్శనం సందర్భంగా కోవిడ్ -19 భద్రతా చర్యలు అమలులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు దర్శనానికి ఒక రోజు ముందు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరియు ఆలయ సందర్శన సమయంలో వారి రిజిస్ట్రేషన్ ఫారంతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు కాపీని జత చేయాలి. "ఒకేసారి 35 మందిని ఆలయం లోపలకు అనుమతించే ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇక భక్తులను ఒక రోజులో 665 మందికి ఆలయ ప్రవేశానికి అనుమతి లభిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story