టిక్‌టాక్ సీఈఓ రాజీనామా

టిక్‌టాక్ సీఈఓ రాజీనామా
టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు.

టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈఓగా కొనసాగుతున్నట్టు కంపెనీ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రిక గురువారం ప్రచురించింది. టిక్‌టాక్ యాప్ తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా అశేష ఆదరణ పొందింది. అయితే, ఈ యాప్ చైనా దేశానికి సంబంధించినది కావడంతో కరోనా రూపంలో టిక్‌టాక్ ఆదరణకు అడ్డంపడింది. కరోనా వుహాన్ లో పుట్టిందని.. అయితే, చైనా మాత్రం ఈ మహమ్మారి విషయంలో ప్రపంచానికి సమాచారం ఇవ్వలేదని.. దీంతో కరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా ఉత్పత్తులపై ప్రపంచ దేశాలు నిషేదాలు విధిస్తున్నాయి. దీనికి తోడు భారత్, చైనా సరిహద్దుల్లో కూడా ఏర్పడిన ఘర్షణతో చైనాకు చెందిన 59 యాప్స్ ను భారత్ బ్యాన్ చేసింది. ఇందులో టిక్‌టాక్ కూడా ఉంది. ట్రంప్ సర్కార్ కూడా అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్ సీఈవో కెవిన్ ప‌దవికి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Tags

Read MoreRead Less
Next Story