తాజా వార్తలు

'రాంగ్ గోపాల్ వర్మ' పోస్టర్ విడుదల

ప్రముఖ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రం లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది

రాంగ్ గోపాల్ వర్మ పోస్టర్ విడుదల
X

ప్రముఖ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రం లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. మరో మహిళాభ్యుదయవాది సంధ్య విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని సీనియర్ జర్నలిస్ట్ ప్రభు డైరక్ట్ చేస్తూ నిర్మిస్తున్నాడు. మహిళలను చిన్నగా చూసే ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తాము స్వాగతిస్తున్నామని సంద్య అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని చిత్ర డైరక్టర్ ప్రభు తెలిపారు. ఈ చిత్రం కోసం తాను రాసిన 'వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ' అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ కానుందని ప్రభు తెలిపారు.

Next Story

RELATED STORIES