భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

భారీ వర్షాలు.. ఐదుగురు మృతి
X
పాకిస్థాన్‌‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షానికి కరాచీ నగరం చిగురుటాకులా వణికిపోతోంది.

పాకిస్థాన్‌‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షానికి కరాచీ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాల కారణంగా శుక్రవారం వరకు ఐదుగురు మృతి చెందారు. ఇక సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరాచీతో సహా దిగువ సింధ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Next Story