తాజా వార్తలు

దేశీయంగా కాటన్‌కు పెరిగిన డిమాండ్

దేశీయంగా కాటన్ ధర దాదాపు 5శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో స్పిన్నింగ్ మిల్స్, విదేశీ సంస్థలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి.

దేశీయంగా కాటన్‌కు పెరిగిన డిమాండ్
X

దేశీయంగా కాటన్ ధర దాదాపు 5శాతం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్పిన్నింగ్ మిల్స్, విదేశీ సంస్థలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. డిమాండ్ పెరగడమే కాదు.. దేశీయంగా స్పిన్నింగ్ మిల్లులు 80శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కొన్ని పూర్తిస్థాయి కేపాసిటీలో వర్కు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. MNCల నుంచి డిమాండ్ ఉండటంతో ముందుముందు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలంటున్నాయి.

కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గత నెల నుంచి కాటన్ ఆక్షన్ మొదలుపెట్టింది. ఇప్పటివరకూ దాదాపు 50లక్షల బేళ్లను విక్రయించింది. ఒక్కో బేల్ 175 కేజీలు ఉంటుంది. 356 కేజీల క్యాండీ ధర ఏకంగా 36,500 నుంచి రూ.38000కు పెరిగింది. మార్కెట్లోకాటన్ కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీలు పనితీరు మెరుగ్గా ఉంది. అంతేకాదు.. స్టాక్స్ లోకూడా ఇది బూస్టప్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

Next Story

RELATED STORIES