తాజా వార్తలు

స్వప్నాలీ కల నేరవేర్చేందుకు అన్నలు..

చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమించొచ్చని నిరూపిస్తోంది పూణె సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని

స్వప్నాలీ కల నేరవేర్చేందుకు అన్నలు..
X

చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమించొచ్చని నిరూపిస్తోంది పూణె సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్. ఇంటర్ లో 98 శాతం మార్కులు సాధించిన స్వప్నాలి వెటర్నరీ డాక్టర్ కావాలని కలలు కంటోంది. అందుకోసం ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతోంది. కుటుంబం నివసించేది ఓ మారుమూల గ్రామం.. అక్కడ ఇంటర్ నెట్ సదుపాయం లేదు. దాంతో ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతోంది.

తాము చదువుకోకపోయిన చెల్లి చదువుకుంటోంది. అందుకు ఆమెకు సహకరించాలని భావించిన అన్నలు ఇంటర్నెట్ సిగ్నల్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఓ షెడ్ నిర్మించారు. ఆ షెడ్ లోనే స్వప్నాలీ రోజూ ఉదయం 7గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చదువుకుంటోంది. స్థానిక మీడియా స్వప్నాలీ కథనాన్ని ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. టాలీవుడ్ హరీష్ శంకర్ సైతం స్పందించారు. ఆమెను చూస్తుంటే మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది అని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే నితేష్ రాణే స్వప్నాలీ హాస్టల్ ఫీజు రూ.50 వేలు చెల్లించారు.

Next Story

RELATED STORIES