తాజా వార్తలు

కోమాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారని దక్షిణ కొరియా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విష

కోమాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారని దక్షిణ కొరియా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి సహాయకుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. కిమ్ కోమాలో ఉండడంతో ప్రస్తుతం ఉత్తర కొరియా బాధ్యతలను కిమ్ సోదరి కిమ్ యో జోంగ్కు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది కిమ్ బయటకు కనిపించింది చాలా తక్కువని ఆయన ఆరోగ్యం క్షీణించిందని చాంగ్ తెలిపారు. కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఏకంగా కోమాలో ఉన్నారని స్వయంగా పక్కదేశానికి చెందిన అధికారి చెబుతున్నాడంటే.. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. ఆ వార్తల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని విశ్వశనీయ వర్గాల సమాచారం.

Next Story

RELATED STORIES