తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 2,384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 472 పాజిటివ్‌ కేసలు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ర్టవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 755కి చేరింది. తాజాగా 1,851 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80,586 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,908 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Next Story

RELATED STORIES