తాజా వార్తలు

అగస్టు 27 నుంచి గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు

తిరుపతిలో గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అగస్టు 27న అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి

అగస్టు 27 నుంచి గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు
X

తిరుపతిలో గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అగస్టు 27న అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్రోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 28న పవిత్ర ప్రతిష్ఠ, యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమానప్రాకారం, ధ్వజస్తంభం, మాడవీధుల్లో శ్రీమఠం, ఆంజనేయస్వామికి పవిత్రాల సమర్పణ జరగనుంది. 30న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES