తాజా వార్తలు

ఇండియాలో అడుగుపెడుతున్నయాపిల్

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. ఇండియాలో నేరుగా అడుగుపెడుతోంది.

ఇండియాలో అడుగుపెడుతున్నయాపిల్
X

అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇండియా సొంతం. ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో చైనా తర్వాత స్థానం ఇండియాదే. ఇప్పటికే భారతీయ ప్రీమియం సెల్ ఫోన్ మార్కెట్లో కీలక వాటా సంపాదించిన అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. ఇండియాలో నేరుగా అడుగుపెడుతోంది. ఇంతకాలం థర్డ్ పార్టీ, ఆన్ లైన్ ద్వారానే అమ్మకాలు సాగించిన కంపెనీ తొలిసారిగా సొంత రిటైల్ స్టోర్ ఏర్పాటుకు రెడీ అయింది.

గత ఏడాది నుంచి కంపెనీ ఇక్కడ రిటైల్ స్టోర్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉంది. అయితే కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టికేలకు దసరాకు ముంబైలో తొలి స్టోర్ కు కొబ్బరికాయ కొట్టనుంది. తర్వాత క్రమంగా బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లకు విస్తరించనుంది యాపిల్.

యాపిల్ కంపెనీ ఐఫోన్లుకు ఇండియామార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయినా FDIలో నిబంధనల కారణంగా నేరుగా విక్రయాలు జరపడం లేదు. దీంతో థర్డ్ పార్టీ ద్వారా అమ్మకాలు జరుపుతోంది. దీంతో పాటు.. ఆన్ లైన్ సైట్లు అమోజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల ద్వారానే మార్కెట్లో హల్ చల్ చేస్తోంది.

రిటైల్ మార్కెట్లోనే కాదు.. అమ్మకాలు భారీగా పెంచుకోవడానికి ఇక్కడే ఉత్పత్తి యూనిట్లు కూడా సిద్దం చేసుకుంటోంది కంపెనీ. ఇప్పటికే అసెంబల్డ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్న విస్ట్రాన్, ఫాక్స్ కాన్ వంటి కంపెనీలు ఇండియాలో యాపిల్ ఫోన్లు ఉత్పత్తి చేయడానికి యూనిట్లు సిద్దం చేశాయి. చైనా నుంచి మకాం మారుస్తున్నాయి. మేడిన్ ఇండియా యాపిల్ ఐఫోన్లు మార్కెట్ లో ముంచెత్తనున్నాయి.

Next Story

RELATED STORIES