ఈ 6 అలవాట్లు ఉంటే.. మీరు ఎప్పటికీ కోటీశ్వరుడు కాలేరు !

ఈ 6 అలవాట్లు ఉంటే.. మీరు ఎప్పటికీ కోటీశ్వరుడు కాలేరు !

ఎదగడానికైనా... పాతాళానికి పడిపోవడానికైనా మన అలవాట్లే కారణమవుతాయి. చిన్న అలవాటే కదా.. దాంతో ఏమవుతుంది అనుకుంటాం కానీ.. అవే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీ ఆర్థిక క్రమశిక్షణను పక్కదారి పట్టించి మీ లక్ష్యాలను దూరం చేసే హ్యాబిట్స్ ఇవే.

రీసెర్చ్ లేకుండా స్టాక్స్‌లో పెట్టుబడి

ఈ మధ్య స్టాక్ మార్కెట్లలో వస్తున్న అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బడ్జెట్ ఎఫెక్ట్‌తో రోజుకు కనీసం 500 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి దిగొస్తున్నాయి. ఇక మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే స్వీయ పరిశోధనతో పాటు నిపుణుల సలహాలు తీసుకుంటే కనీసం కొద్ది నష్టాలతో అయినా మనం బయటపడే వీలుంటుంది.

పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్, ఫండ్స్ వద్దు

రిస్కును తగ్గించుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తాం. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. తమ పోర్ట్‌ఫోలియోను అత్యధిక స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో నింపేస్తూ ఉంటారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఓ మోడర్న్ పోర్ట్‌ఫోలియోలో 15-20కి మించి స్టాక్స్ సరిపోతాయి. అది కూడా వివిధ రంగాలకు చెందినవై ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్

సాధారణంగా అధిక శాతం మంది దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. తమ రిటైర్మైంట్ కోసం దాచుకున్న సొమ్మును 40వ ఏటనే వైద్య ఖర్చులకు వినియోగించేస్తున్నారని తేలింది. అంటే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అంతగా మొగ్గుచూపడం లేదు. ఒక్క అనారోగ్య సమస్య ఏళ్లకు ఏళ్లు కూడబెట్టుకున్న సొమ్మంతటినీ కరిగించేస్తుంది. అందుకే ఎలాంటి రెండో ఆలోచనా లేకుండా ముందుగా ఆరోగ్య బీమా తీసుకునే అంశాన్ని తప్పకుండా పరిశీలించండి.

ట్యాక్స్ కోసం ఇన్సూరెన్స్ కొనొద్దు

ఏటా కోట్ల మంది జనాలు ట్యాక్స్ తగ్గించుకునేందుకు కోట్ల రూపాయల ధనాన్ని ఇన్సూరెన్సుల కోసం వెచ్చిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది సరైన పద్ధతి కాదు. మన ఫైనాన్షియల్ కండిషన్, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలి కానీ ఇలా పన్ను తగ్గుతుందని, ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేయొద్దు.

ఉద్యోగాలు వదిలేసి సొంత వెంచర్స్

స్థిరంగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపారాల్లోకి దిగేముందు అన్నీ ఆలోచించుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా అని ధైర్యం చేయొద్దనీ, ఉద్యోగులుగానే మిగిలిపోవాలని చెప్పడం లేదు. వాంటర్ ప్రెన్యూర్స్.. అంటే.. పారిశ్రామికవేత్తలు కావాలని కలలుగనే వారు మాత్రమే. ఎంతటి కష్టమొచ్చని నిలదొక్కుకునే మానసిక, ఆర్థిక స్థిరత్వం ఉన్నవాళ్లే ఇందులోకి దిగాలి.

అప్పుల కుప్ప పేర్చుకోవద్దు

క్రెడిట్ కార్డుల ఫ్రాడ్స్ ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అందుకే బ్యాంక్స్ నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్‌లను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే ఇరుక్కుపోతాం. నెలనెలా కట్టుకుంటే పోయే డబ్బును లెక్కగడితే మీరు బ్యాంకుకు ఎంతలేదన్నా ఏడాదికి 70-80 శాతం వరకూ వడ్డీని కడ్తూ ఉంటారనే సంగతిని కనుక్కోలేరు. పెట్టుబడుల సంగతి పక్కనబెట్టి ముందు అప్పులను సాధ్యమైనంత వరకూ తీర్చుకునే ప్రయత్నం చేయండి.

Tags

Read MoreRead Less
Next Story