తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 3018 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.11 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3018 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 3018 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు రాష్ర్టంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.11 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసి పరిధిలో 475 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు బుధవారం తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 780 కి చేరింది.

Next Story

RELATED STORIES