అన్నీ కలిపి తినేస్తున్నారా.. అస్సలు అలా చేయకండి

చిన్నప్పుడు నానమ్మ.. చారు పెట్టి అందులోకి ముద్ద పప్పు కలుపుకుని తినమనేది.. అదేంటి నానమ్మా.. అదేదో రెండూ కలిపి పప్పుచారు (సాంబార్) పెట్టొచ్చుగా అంటే.. దేని రుచి దానిదే.. తిని చూడవే తెలుస్తుంది అనేది.. అలాగే గోంగూర పచ్చడి ముద్దపప్పు.. పెరుగు ఆవకాయ్.. ముద్ద ముద్దకు రుచి పెరుగుతూ ఇంకా ఇంకా తినాలనిపించే కొన్ని కాంబినేషన్లు అద్భుతహా అని అనిపించక మానవు. కొన్ని కాంబినేషన్లు అంత బావుంటాయి మరి. అలా అని అన్నీ కాదండోయ్.. కొన్నింటిని కలిపి తింటే విషం అంటున్నారు ఆహార నిపుణులు.

చిలకడ దుంప-టమోటా: టమోటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. స్టార్చ్ కార్బొహైడ్రేట్స్ చిలకడ దుంపల్లో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌తో సిట్రిక్ యాసిడ్ కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ కాంబినేషన్‌తో కూరవండి తింటే అలసటగా అనిపిస్తుంది. భోజనం చేసిన తరువాత పండ్లు: అన్నం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పండ్లు త్వరగా అరిగిపోతాయి. కాబట్టి వెంటవెంటనే తింటే కడుపులోని పేగులు ఇబ్బంది పడతాయి. పేగుల్లోని లోపలి పొర దెబ్బతింటుంది.
మాంసాహార పదార్థాలు-పిండిపదార్థాలు: ఈ రెండు కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వలన కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది.

పెరుగు-పళ్లు: పాల ఉత్పత్తులు సైనస్‌లను మూసివేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగు తిన్న వెంటనే పండ్లు తినకుండా ఓ గంట ఆగి తినాలి.
చేపలు, వెన్న కలిపి తీసుకోకూడదు.. అలాగే గుడ్డు తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఉప్పు వేసిన చీజ్ కూడా మంచిది కాదు. ఈ రెండు విరుద్ద ఆహార పదార్థాలు. కాబట్టి ఉప్పు లేని చీజ్ తెచ్చి వాడుకోవాలి. వేడి, చల్లని పదార్థాలు.. ఈ రెండింటిని వెంటవెంటనే తీసుకోకూడదు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వేడి వేడిగా భోజనం తిని చల్లని ఐస్ క్రీం తింటారు. ఇలా తినడం వలన జీర్ణగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతింటుంది. పాలు తాగిన వెంటనే యాంటీ బయాటిక్ మాత్రలు వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఆ పాలల్లోనే క్యాల్షియం శరీరం గ్రహించదు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *