మూడేళ్లలో అప్పులు తీరుస్తాం : టాటా మోటార్స్

మూడేళ్లలో అప్పులు తీరుస్తాం : టాటా మోటార్స్

పీకల్లోతు అప్పుల్లో ఉన్న దేశీయ ఆటో దిగ్గజం సరికొత్త వ్యూహాలతో వస్తోంది. కంపెనీకున్న సుమారు రూ.48 వేల కోట్ల బకాయిలు తీర్చడంతో పాటు.. జీరో డెబిట్ కంపెనీగా చేస్తామంటోంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్. సరిగ్గా మూడేళ్లలో కంపెనీ జీరో డిబెట్ సాకారం చేస్తామన్నారు. ఇందుకోసం రకరకాల ఆప్షన్లు ఉన్నాయన్నారు. ఇందులో ప్రధానంగా తమ నాన్ కోర్ బిజినెస్ లో స్టేక్ అమ్మడానికి కూడా సిద్దంగా ఉన్నామన్నారు. ఇన్వెస్ట్ మెంట్ అన్ లాక్ చేసినట్టు తెలిపారు.

FY22లో కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా అనుచరించనున్నట్టు వెల్లడించారు. అయితే యూకేలో ఉన్న జాగ్వార్ లాండ్ రోవర్ కంపెనీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇందులో వాటా విక్రయిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఇప్పటికే కంపెనీ ఖండించింది. ఈ నేపథ్యంలో ఏయే సంస్థల్లో వాటాలు విక్రయిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ఇటీవల టాటా కంపెనీ తీసుకొచ్చిన కొత్త మోడల్స్ ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. వినియోగదారులను ఆకట్టుకుంటున్నమోడల్స్ మాత్రమే మార్కెట్లో ఉంటాయన్నారు. వీటితో పాటు పలు కొత్త మాడల్స్ తో ఇండియన్ మార్కెట్లో కీలక శక్తిగా ఎదగాలని కంపెనీ భావిస్తోంది. అటు మార్కెట్లో వాటా పెంచుకోవడంతో పాటు.. ఇటు నాన్ కోర్ బిజినెస్ లో స్టేక్ విక్రయాల ద్వారా కంపెనీ అప్పుల నుంచి బయటపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story