తాజా వార్తలు

IPOకు రానున్న కల్యాణ్ జ్యూయెలరీ

బంగారం రిటైల్ కంపెనీ కల్యాణ్ జ్యూయెలరీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. దీనికి సంబంధించి ఫైల్ సెబీకి పంపింది సంస్థ.

IPOకు రానున్న కల్యాణ్ జ్యూయెలరీ
X

కేరళకు చెందిన బంగారం రిటైల్ కంపెనీ కల్యాణ్ జ్యూయెలరీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. దీనికి సంబంధించి ఫైల్ సెబీకి పంపింది సంస్థ. మొత్తం 1750 కోట్లు సమీకరించనుంది. ఇందులో ఫ్రెష్ ఫండ్ రైస్ రూ.1000 కోట్లు కాగా, సెకండరీ షేర్ సేల్స్ రూ.750 కోట్లు. ఇది దేశంలోనే అతిపెద్ద యెల్లో మెటల్ రిటైల్ సంస్థ IPOగా చెబుతున్నారు.

కంపెనీకి సంబంధించి షేర్ల విక్రయ వ్యవహారాలు యాక్సీస్ కేపిటల్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ చూసుకుంటున్నాయి. కల్యాణ్ జ్యూయెలర్స్ కంపెనీ IPO ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ కార్యనిర్వహణకు, కేపిటల్ ఫండ్ గా వినినియోగించనుంది. ఇక కల్యాణ్ జ్యూయెలర్స్ 1993లో త్రిచూర్ లో ఫస్ట్ స్టోర్ తో మొదలైంది. ప్రస్తుతం కంపెనీకి ఇండియాలో 107 స్టోర్లు, విదేశాల్లో 30 షోరూములున్నాయి.

కల్యాణ్ జ్యూయెలర్స్ గత ఏడాది మొత్తం ఆదాయం 10,100 కోట్లుగా చూపించింది. ఇందులో 78శాతం ఇండియాలో, 21.8శాతం విదేశాల్లో ఆర్జించింది. కంపెనీకి టైటన్ తనిష్క్ గట్టి పోటీ ఇస్తుంది. తనిష్క్ సంస్థకు దాదాపు 250కి పైగా స్టోర్లున్నాయి.

Next Story

RELATED STORIES