ఇదేం కారు.. ఇంత రేటు.. రూ.14 కోట్లంట!!

ఇదేం కారు.. ఇంత రేటు.. రూ.14 కోట్లంట!!

స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు వాడుకలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి. వాటికంటూ కొన్ని స్పెషల్ ఫీచర్లతో తయారు చేస్తాయి కంపెనీలు. అందరి దగ్గరా ఉన్న కారే తమ దగ్గర కూడా ఉంటే స్పెషలేముంది అని అనుకునే వారికి 'ఎవియా' కార్‌ని ఎంచుకోమంటోంది బ్రిటన్‌కి చెందిన ఆటో కంపెనీ లోటస్. సాధారణంగా చిన్న స్పోర్ట్స్ కార్లను తయారు చేసే లోటస్.. ఈసారి 2 మిలియన్ డాలర్ల (మన దేశ కరెన్సీలో రూ.13,78,10,000).. 1900 హార్స్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఫలితంగా ఇది రోడ్ కార్లలో ప్రపంచంలోనే పవర్‌ఫుల్ సిరీస్ మోడళ్లలో ఒకటైంది. మూడే మూడు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే వారికి ఎవియా బాగా నచ్చుతుందని లోటస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ పొఫామ్ అన్నారు. నిజానికి ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ మన్నిక ఇవ్వవని, బ్యాటరీ త్వరగా వేడెక్కిపోతుందని.. అందువల్లే లంబోర్గినీ, ఫెర్రారీ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం లేదని అన్నారు. కానీ తాము మాత్రం సమస్యలన్నింటినీ నివారించుకుంటూ ఎవియా కారుని రూపొందించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story