తాజా వార్తలు

మహారాష్ట్రలో మహద్‌ భవనం కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు

మహారాష్ట్రలో మహద్‌ భవనం కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు
X

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మహద్‌లో ఐదంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. భవనం కింద సుమారు 75 మంది వరకు చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 60 మంది వరకు రక్షించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి.

శిథిలాల నుంచి మంగళవారం నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా , బాలుడి తల్లి, సోదరి విగతజీవులై కనిపించారు. దీంతో సంఘటనా స్థలంలో విషాదం అలుముకుంది. మృతుల బంధువులకు రాష్ట్ర సర్కార్ రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి తారిక్ గార్డెన్‌కు చెందిన బిల్డర్, ఆర్కిటెక్ట్ సహా ఐదుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES