తాజా వార్తలు

రూ.2వేల నోటు ముద్రణపై ఆర్బీఐ..

రూ.2వేల నోటు ముద్రణ క్రమంగా తగ్గుతోందని కేంద్ర బ్యాంకు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రూ.2వేల నోటు ఒక్కటి కూడా

రూ.2వేల నోటు ముద్రణపై ఆర్బీఐ..
X

రూ.2వేల నోటు ముద్రణ క్రమంగా తగ్గుతోందని కేంద్ర బ్యాంకు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రూ.2వేల నోటు ఒక్కటి కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది. 2018 నుంచి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మరోవైపు గత మూడేళ్ల నుంచి 500, 200 రూపాయల వాడకం పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. చెలామణిలో ఉన్న 2వేల కరెన్సీ వాడకం 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి నాటికి 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి ఆఖరికి 27,398 లక్షల నోట్లకు పడిపోయిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. కరోనా ప్రభావం కరెన్సీ నోట్లపై కూడా పడింది. లాక్‌డౌన్‌ కారణంగా 2019-20లో నోట్ల సరఫరా 23.3 శాతం తగ్గిందని తెలిపింది.

Next Story

RELATED STORIES