స‌ర‌యూ న‌ది ఉగ్రరూపం.. నీట మునిగిన ఎనిమిది గ్రామాలు

స‌ర‌యూ న‌ది ఉగ్రరూపం.. నీట మునిగిన ఎనిమిది గ్రామాలు
స‌ర‌యూ న‌ది ఉగ్రరూపం దాల్చింది. నది పొంగి పొర్లుతుండ‌టంతో ఆల‌పూర్‌, టాండా ఏరియాల్లోని ఎనిమిది గ్రామాలు నీట మునిగాయి.

దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరపి లేకండా వానలు పడుతున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. అనేక చోట్ల ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు నిలించింది. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బారిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల‌పూర్‌, టాండా ఏరియాలు పూర్తిగా జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. స‌ర‌యూ న‌ది ఉగ్రరూపం దాల్చింది. సరయూ నది పొంగి పొర్లుతుండ‌టంతో ఆల‌పూర్‌, టాండా ఏరియాల్లోని ఎనిమిది గ్రామాలు నీట మునిగాయి. స‌ర‌యూ న‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌క‌ముందే.. ప్ర‌జ‌ల‌ను ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా సుర‌క్షిత ప్రాంతాలకు త‌ర‌లించామ‌ని అధికారులు తెలిపారు. బాధితుల కోసం ప్ర‌త్యేక శిబిరాలు ఏర్పాటు చేశామ‌ని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story