తాజా వార్తలు

అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఊపిరి తీసుకుంటూ..

మరణిందనుకున్న ఓ మహిళ శ్వాస తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలోని డెట్రాయిట్ కు చెందిన ఓ 20 ఏళ్ల

అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఊపిరి తీసుకుంటూ..
X

మరణిందనుకున్న ఓ మహిళ శ్వాస తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలోని డెట్రాయిట్ కు చెందిన ఓ 20 ఏళ్ల మహిళ మరణించిందనుకుని అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్సను ప్రారంభించగా పల్స్ రేటు, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు గుర్తించారు. గత ఆదివారం పారామెడిక్స్ సిబ్బందికి ఓ మహిళ ఫోన్ చేసి అపార్ట్ మెంట్ లో గుర్తు తెలియని ఓ మహిళ అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు తెలిపింది. సమాచారం అందుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు ధృవీకరించారు. అనంతరం జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు.

Next Story

RELATED STORIES