Dhanush: ఆ సినిమా కోసం ధనుష్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

Dhanush: ఆ సినిమా కోసం ధనుష్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..
Dhanush: ప్రస్తుతం ధనుష్.. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ‘తిరుచిత్రంబలం’ అనే మూవీ చేస్తున్నాడు.

Dhanush: సినీ పరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. ఒక సినిమా హిట్ అవ్వగానే దాని తర్వాత సినిమాలకు ఏ మాత్రం తగ్గని రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు హీరోలు. ఇక ఇటీవల హాలీవుడ్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ధనుష్.. కోలీవుడ్ మేకర్స్‌కు తన రెమ్యునరేషన్‌తో చుక్కలు చూపిస్తున్నాడట.

సౌత్‌లో ఏ హీరోకు దక్కని హాలీవుడ్ అవకాశం ధనుష్‌కు దక్కింది. ఇప్పటికే ఓ ఇంగ్లీష్ సినిమాలో హీరోగా చేసిన తర్వాత ఇటీవల తనకు 'గ్రే మ్యాన్' మూవీలో కూడా కీలక పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంతో ధనుష్ పేరు హాలీవుడ్‌లో కూడా మారుమోగిపోయింది. దీంతో కోలీవుడ్‌లో తన తరువాతి సినిమాకు ధనుష్ అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి చర్చ మొదలయ్యింది.

ప్రస్తుతం ధనుష్.. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో 'తిరుచిత్రంబలం' అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీకి ధనుష్ రూ.12 నుండి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే గ్రే మ్యాన్‌కు ధనుష్ ఒక్క సినిమాకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ వరకే తీసుకునేవాడట. కానీ ఇప్పుడు అమాంతం ఆ రేంజ్‌లో పారితోషికం పెంచేయడంతో నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట.

Tags

Read MoreRead Less
Next Story