Rajamouli: 'ఆ హీరోతో పనిచేయాలని ఉంది': రాజమౌళి

Rajamouli: ఆ హీరోతో పనిచేయాలని ఉంది: రాజమౌళి
Rajamouli: చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ సమయంలో రాజమౌళికి ఏ హీరోతో పనిచేయాలని ఉందనే ప్రశ్న ఎదురయ్యింది.

Rajamouli: మామూలుగా దర్శకులకు తమకు నచ్చిన హీరోతో పనిచేయాలని కోరిక ఉంటుంది. అలాగే దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్నా రాజమౌళికి కూడా ఓ హీరోతో కలిసి నటించాలని ఉందని బయటపెట్టాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్‌తో సినిమా ప్రారంభం అవ్వడానికి ఇంకా సమయం ఉండడంతో రాజమౌళి తను సమర్పిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని సౌత్‌లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు.

రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమా హిందీలోనే కాదు సౌత్‌లో కూడా చాలా భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాను సౌత్‌లో రాజమౌళి సమర్పిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగా రాజమౌళి కూడా ఇందులో పాల్గొంటున్నాడు.

చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ సమయంలో రాజమౌళికి ఏ హీరోతో పనిచేయాలని ఉందనే ప్రశ్న ఎదురయ్యింది. అయితే వెంటనే దానికి సమాధానంగా రజినీకాంత్ పేరు చెప్పాడు రాజమౌళి. అయితే సమయం, కథ అన్నీ కరెక్ట్‌గా కుదిరితేనే ఇది సాధ్యమవుతుందని కండీషన్స్ కూడా పెట్టాడు. అయితే రజినీకాంత్‌తో సినిమా చేయాలని ఉందనే తన కోరికను బయటపెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. మరి ఈ ఆర్ఆర్ కాంబినేషన్ ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story