Yoo Joo Eun: 27 ఏళ్ల నటి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్..

Yoo Joo Eun: 27 ఏళ్ల నటి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్..
Yoo Joo Eun: సినీ పరిశ్రమలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది.

Yoo Joo Eun: సినీ పరిశ్రమలో హఠాత్తుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సౌత్ కొరియాకు చెందిన 27 ఏళ్ల నటి యో జూ యూన్ ఆత్మహత్య స్థానికంగా కలకలం సృష్టించింది. తను సూసైడ్ స్పాట్ నుండి కుటుంబ సభ్యులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. పలు సిరీస్‌లలో నటించి ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది యో జూ యూన్. ఇక తను రాసిన సూసైడ్ నోట్‌ను చదివిన తన ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతున్నారు.

'ముందుగా నేను వెళ్లిపోతున్నందుకు సారీ. ముఖ్యంగా అమ్మ, నాన్న, నాన్నమ్మ, తమ్ముడు మీకు సారీ. నా మనసు బ్రతకాలని లేదని అరుస్తోంది. నాకు బ్రతకాలని లేదు. నేను లేకుండా జీవితం వెలితిగా ఉంటుంది కానీ ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించండి. నేను అన్ని చూస్తూనే ఉంటాను. దయచేసి ఏడవకండి. నాకిప్పుడు కొంచెం కూడా బాధ లేదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. నేను దీని గురించి చాలాకాలంగా ఆలోచిస్తున్నాను కాబట్టే ఇలా అనిపిస్తుందేమో. నేను అనుకున్నదానికంటే ఆనందమైన జీవితాన్ని గడిపాను. అందుకే ఇది నాకు చాలు. ఇది చాలు. ఇక ఎవరిపై ఏ నిందలు లేకుండా జీవించండి. నేనేమీ చనిపోలేదు. అందుకే అందరూ సంతోషంగా ఉండండి. నా అంతిమ సంస్కారానికి చాలామంది వస్తారని కోరుకుంటున్నాను. వారిలో ఎవరైనా కష్టంగా తమ జీవితాన్ని గడుపుతున్నారేమో తెలుసుకోవాలని ఉంది.'

'నాకు నటించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఒకవేళ అది నాలో ఒక భాగమేమో. కానీ ఆ జీవితం అంత సులభం కాదు. నాకు ఇంకేమీ చేయాలని లేదు. అదే నాకు నిరాశ. మనం నచ్చింది చేయాలనుకోవడం వరం. కానీ అది మాత్రమే చేయాలనుకోవడం మాత్రం శాపం. దేవుడికి నేనంటే ఇష్టం. అందుకే నరకానికి పంపడు. ఆయన నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకే ఎవరూ దిగులు చెందకండి. నన్ను ప్రేమించినందుకు నా కుటుంబానికి, స్నేహితులకు థాంక్యూ. అదే నా బలం, నా ఆనందం. నేను చివరివరకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో జీవించాను. అదే నా సక్సెస్ అనుకుంటాను. నేను దీనిని మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నానో. నేను కలుపుకున్న బంధాలకు, ముఖ్యంగా నా గురువులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ, నాన్న ఏడవకండి ప్లీజ్' అని యో జూ యూన్ తన సూసైడ్ నోట్‌లో రాసింది.

Tags

Read MoreRead Less
Next Story