Review : ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్

Review : ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్
మూవీ లవర్స్ కి మంచి ట్రీట్

హాలీవుడ్ లోని సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒకటి. ఈ సీరీస్ లో లేటెస్ట్ గా వచ్చిన సినిమానే “ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ “. ఇప్పుడు ఇది ఇండియా లోనే మంచి బజ్ తో ఉన్న సినిమాగా ముందుకు వెళుతోంది.

ఈ సిరీస్ లవర్స్ ఈ పర్టిక్యులర్ పార్ట్ కి బాగా ఎదురు చూసారు ఎందుకంటే ఇందులో ఉన్న బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా దానిపై ఉన్న సీక్వెన్స్ లు. అలాగే వాటితో పాటుగా ఆటోబాట్స్ పై సీక్వెన్స్ లు మంచి విజువల్ ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను యూనిక్ వే ప్రెజెంటేషన్ కోసం వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు మరి వారిని కూడా ఈ చిత్రం డిజప్పాయింట్ చేయదు.

ఇక ఈ పార్ట్ స్టోరీ లైన్ లోకి వస్తే..యూనికాన్ అనే ఓ డార్క్ డెవిల్ స్పేస్ లో కాలం గుండా ప్రయాణించే ఓ ట్రాన్స్ వార్ప్ కీ కావాలని కోరుకుంటాడు. అయితే ఈ కీ ని భూమిపై మాగ్జిమల్స్ అనే కొన్ని రోబోటిక్ బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ కొన్ని భాగాలుగా విభజించి దాచి కాపాడుతూ ఉంటాయి. మరి ఈ కీ విషయంలో యూనికాన్ ఏం చేస్తాడు.. సంపాదిస్తాడా లేదా. అసలు ఇంకెవరైనా ఈ కీ కోసవెతుకుతున్నారా లేదా? ఈ క్రమంలో ఆప్టిమస్ ప్రైమ్, ఇంకా తన తన ఆటో బాట్స్ పాత్ర ఎలా ఉంటుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని స్క్రీన్ పై చూడాల్సిందే.


ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను వినూత్నంగా ప్రెజెంట్ చేశారని చెప్పచు. ముఖ్యం గా గా సెకండాఫ్ లో ఆప్టిమస్ ప్రైమ్ పై సీక్వెన్స్ లు బాగుంటాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో స్టన్నింగ్ విజువల్స్, స్లో మోషన్స్ సహా బాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్సింగ్ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. నిజానికి ఇలాంటి సినిమాలలో స్టోరీ అంతా భూమిని ఎలా కాపాడాలనే కాన్సెప్ట్ లోనే ఉంటాయి. ఇది కూడా అదే కోణంలో కనిపిస్తుంది. సో కొత్త పాయింట్ ఉండకపోయినా మేకింగ్ లో పెట్టే ద్రుష్టి సినిమాని ముందు వరుసలో నిలబెడుతుంది. అలాగే గత సినిమాలతో పోలిస్తే యాక్షన్ సీక్వెన్స్, బలమైన ఎమోషన్స్ ఇందులో మిస్ అయ్యాయి. నిజానికి ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ లో ఆప్టిమస్ ప్రైమ్ కి ఏ లెవెల్ క్రేజ్ ఉందో అదే విధంగా మరో ఆటోబాట్ బంబుల్ బీ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే దానిపై ఈ సినిమాలో సీక్వెన్స్ లు స్క్రీన్ స్పేస్ తక్కువే కనిపిస్తుంది.

మొత్తానికి “ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ ” మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. అందుకే ఇది ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story