Manipur Violence : మణిపూర్ లో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు

Manipur Violence : మణిపూర్ లో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు

మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడులు దిగాయి. దీంతో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనాస్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు జిల్లాల్లో సైనికులు కవాతు నిర్వహించారు. మణిపూర్‌లో చర్చిలపై జరిగిన దాడులపై ప్రపంచ వ్యాప్తంగా కథనాలు రావడంతో కేంద్రం రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను హుటాహుటిన రాష్ట్రానికి పంపించింది. హింసపై ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని మైతై సామాజిక వర్గం డిమాండ్‌ చేస్తోంది. దీన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో ఇతర పట్టణాల్లో ఘర్షణలు జరగడంతో ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

Tags

Read MoreRead Less
Next Story