తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు..ఉక్కపోత

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు..ఉక్కపోత
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు పెరిగాయి. అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత మొదలైంది. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది వాతావరణశాఖ

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు పెరిగాయి. అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత మొదలైంది. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్... కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఇండోనేషియాలో తుఫాన్ ప్రారంభమైంది. దీని వల్ల రాజస్థాన్ నుంచి వేడిగాలులు దక్షిణాది వైపునకు వీయడం మొదలయ్యాయి. దీని వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అధిక ఉష్ణోగ్రతలు ఈ నెల 22 వరకు ఉంటాయంటున్నారు. ఈనెల 11 నుంచి వేడిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావద్దంటున్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story