సుప్రీంలో కేజ్రీవాల్‌ సర్కార్‌కు విజయం

సుప్రీంలో కేజ్రీవాల్‌ సర్కార్‌కు విజయం
ఢిల్లీపై అధికారం ఎవరిది?అనే వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది

సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ సర్కార్‌కు విజయం లభించింది. ఢిల్లీపై అధికారం ఎవరిది?అనే వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీలో సివిల్‌ సర్వెంట్ల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని తెలిపింది. అసెంబ్లీ వెలుపల అంశాలపైనే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ జోక్యం ఉంటుందని తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పాటించాల్సిందే అన్న రాజ్యంగ ధర్మాసనం ఎన్నుకోబడిన ప్రభుత్వానికి పాలనపై నియంత్రణ ఉండాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది.

గత కొంత కాలంగా కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. గతంలో కేంద్ర రాష్ట్ర అధికారాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విభేదించిన రాజ్యంగ ధర్మాసనం తాజాగా తన తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి పరిమిత అధికారులే ఉంటుందని ఏప్రిల్‌ 14, 2019న ఏకే సిక్రీ, అశోక్‌ భూషణ్‌తో కూడిన బెంచ్‌ ఇచ్చిన తీర్పు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story