Karnataka : కర్నాటక సీఎం ఎంపిక... సాయంత్రానికి వీడనున్న సస్పెన్స్

Karnataka : కర్నాటక సీఎం ఎంపిక... సాయంత్రానికి వీడనున్న సస్పెన్స్

కర్నాటక సీఎం ఎంపికపై ఇవాళ సాయంత్రానికి సస్పెన్స్‌ వీడనుంది. సిద్దరామయ్య వైపే కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతోంది. కర్నాటక నూతన సీఎంగా సిద్దరామయ్య పేరు ఖరారు లాంఛనమేనని తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ అధిష్టానం చర్చలు జరిపింది. ఎల్లుండి నూతన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణం చేసే అవకాశముంది. బెంగళూరు కంఠీరవ క్రీడా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు 15మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. 10మందికిపైగా మాజీ మంత్రులకు మళ్లీ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో సోనియాగాంధీ నిర్ణయాన్ని శిరసావహిస్తాననన్నారు డీకే శివకుమార్‌. రాహుల్‌గాంధీ సైతం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రితో పాటు దక్షిణాది పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌ ఉంది. లోక్‌సభ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ కొనసాగించనున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో రెండు గంటలుగా ఏఐసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ఇతర కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రానికి కర్నాటక ముఖ్యమంత్రి పేరును ప్రకటించనున్నారు.

ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడమే సిద్దరామయ్యకు ప్లస్‌ పాయింట్‌గా మారింది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్దరామయ్యకే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ముఖ్యమంత్రిగా అపార అనుభవం సిద్దరామయ్య సొంతం. కాంగ్రెస్‌ పంచ పథకాలను అమలు చేయాలంటే అనుభవజ్ఞుడైన.. సిద్దరామయ్య లాంటి సీఎం అవసరమని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సిద్ధూకు ప్రభుత్వ బాధ్యతలు.. డీకే శివకుమార్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story