Karnataka CM 2023 : కర్నాటక సీఎంగా సిద్దరామయ్య

Karnataka CM 2023 : కర్నాటక  సీఎంగా సిద్దరామయ్య

కర్నాటక నూతన సీఎంగా సిద్దరామయ్య పేరు ఖారరైంది. ఆయన పేరును కాసేపట్లో బెంగళూరులో అధికారకంగా ప్రకటించనుంది కాంగ్రెస్‌ అధిష్టానం. డీకే, సిద్దరామయ్యతో రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.అనేక చర్చల తరువాత సిద్దరామయ్య పేరును ఫైనల్‌ చేశారు. సిద్దరామయ్యకి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు రాహుల్‌. సిద్దరామయ్యే సీఎం అంటూ ముందే టీవీ5 ముందే చెప్పింది. మరోవైపు రేపు కంఠీరవ స్టేడియంలో ఆయన రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు.సీఎంతో పాటు 15మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అటు.. బెంగళూరులో సిద్దరామయ్య ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఆయన ఇంటికి కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. సిద్దరామయ్య సాయంత్రం బెంగళూరుకు చేరుకోనున్నారు. ఆయన ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. పాలాభిషేకాలు, క్రాకర్స్‌తో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.

మరోవైపు రాజకీయంగా సిద్దరామయ్యకు క్లీన్ ఇమేజ్ ఉంది, అవినీతి రహితుడనే పేరుంది. వెనకబడిన వర్గం అయిన కురబ కమ్యూనిటికీ చెందిన సిద్దరామయ్యకు ఓబీసీల్లో క్రేజ్ ఉండటం కలిసి వస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఓబీసీల మద్దతుతో గెలిచామని మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిద్ద రామయ్యను వ్యతిరేకిస్తే తమ రాజకీయ మనుగడను ప్రశ్నార్థకం చేసుకుంటామనే ఆలోచన ఎమ్మెల్యేల్లో ఉంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ కష్టపడిన విధానం వల్ల ఎమ్మెల్యేల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు ప్రజలు మద్దతు కూడా సిద్దరామయ్యకే ఉండటం కూడా ఆయనకు ప్లస్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story