Encounter : జమ్మూలో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

Encounter :  జమ్మూలో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ఈ ఉగ్రవాదుల హస్తం

జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్, అలియాస్ అబ్రార్ గా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల గురించి జమ్మూకశ్మీర్ పోలీసులు ఎక్స్ లో పోస్టు చేశారు.


కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మహత్యలో వారి హస్తం ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఎదురుకాల్పుల అనంతరం జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తదుపరి చికిత్స నిమిత్తం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత, అప్పటికే ప్రత్యేక సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ ఎటు కలవాలో తేల్చుకోలేక పోయింది. కశ్మీర్ తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకోవాలని బలంగా కోరుకున్నప్పటికీ.. అప్పటి రాజకీయ పరిణామాలు సహకరించలేదు. అటు పాకిస్థాన్, లేదా భారత్ వైపు విలీనం కావాల్సిన పరిస్థితిని కల్పించాయి. హిందూ మహారాజు పరిపాలనలోని జమ్మూకశ్మీర్‌ జనాభాలో మెజారిటీ ముస్లింలు. దీంతో వారు పాకిస్థాన్లో కలవాలని భావించారు. కాని అప్పటి హిందూ రాజుమాత్రం భారత్ కు అనుకూలంగా ఉన్నారు. దీంతో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. అదే ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ గా వ్యవహరిస్తున్నాం. మిగిలిన భాగం భారత్ లో విలీనం అయింది. ప్రత్యేక రాజ్యాంగం రద్దు చేసిన తరవాత కశ్మీర్ లో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story