Himachal Pradesh: భారీ వర్షాలతో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. వీడియో వైరల్..

Himachal Pradesh: భారీ వర్షాలతో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. వీడియో వైరల్..
Himachal Pradesh: ఎడతెరిపి లేని వర్షాలతో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది.

Himachal Pradesh: ఎడతెరిపి లేని వర్షాలతో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​ శిమ్లా జిల్లాలోని చౌపాల్​ బజార్​లో జరిగింది. భవనంలో ఉన్నవారిని ముందే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. బిల్డింగ్​ కూలిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ బిల్డింగ్‌లో ఓ బ్యాంకు, రెండు దుకాణాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story