Kochi Stampede : కేరళ కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట..

Kochi Stampede :  కేరళ కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట..
నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు

కేరళ కొచ్చిలో యూనివర్సిటీ ఫెస్టివల్ లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో శనివారం ఓపెన్ ఎయిర్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 64 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతులు అతుల్ తంబి, ఆన్ రుఫ్తా, సారా థామస్, ఆల్విన్ జోసెఫ్‌లుగా గుర్తించారు. ఆల్విన్ మినహా మిగిలిన ముగ్గురు విద్యార్థులు కొచ్చిన్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.

కనీసం 64 మంది విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొచ్చిలోని కలమస్సేరి మెడికల్ కాలేజీలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు చనిపోయారని మంత్రి ఎమ్మెస్ జార్జ్ చెప్పారు. “వార్త చాలా దురదృష్టకరం. 46 మందిని గాయాలతో కలమస్సేరి మెడికల్ కాలేజీకి తీసుకువచ్చారు. నలుగురు మరణించారు, వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు” అని ఆరోగ్య మంత్రి తెలిపారు.

గాయపడిన 18 మందిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రులను అప్రమత్తం చేశామని.. అధికారుల బృందం ఆసుపత్రుల నుంచి సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. కాగా.. గాయపడిన వారికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అయితే, ఈ ఫెస్ట్ కు పాసులు ఉన్నవారికే ప్రవేశం ఉందని అధికారులు తెలిపారు. లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే గేటును ఉపయోగించడం తొక్కిసలాటకు కారణమైందని పేర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story