పిల్లలను బడులకు పంపడం 78 శాతం తల్లిదండ్రులకు ఇష్టం లేదు!

పిల్లలను బడులకు పంపడం 78 శాతం తల్లిదండ్రులకు ఇష్టం లేదు!
కోవిడ్ సంక్షోభం కారణంగా గత ఆరునెలలుగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 21 నుండి 9 వ తరగతి నుండి 12 వ తరగతి విధ్యార్థులకోసం పాఠశాలలు..

కోవిడ్ సంక్షోభం కారణంగా గత ఆరునెలలుగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే నేటినుంచి నుండి 9 వ తరగతి నుండి 12 వ తరగతి విధ్యార్థులకోసం పాఠశాలలు తెరుచుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.. ఇందుకోసం కొన్ని కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా విద్యార్థులు సంసిద్ధత తోపాటు తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం పూర్తిగా వారి ఇష్టానికి వదిలేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తమ పిల్లను పాఠశాలకు పంపించడానికి మెజారిటీ తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఎస్పీ రోబోటిక్స్ వర్క్స్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

అంటువ్యాధి ముగిసే వరకు 78 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించటానికి సుముఖంగా లేరని తేలింది.హైదరాబాద్, బెంగళూరులో నివసిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాతే పిల్లల్ని పాఠశాలకు పంపాలని భావిస్తున్నారు. అయితే ఈ నగరాలతో పోలిస్తే చెన్నై , కోల్‌కతాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలతో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇక్కడ 64 శాతం తల్లిదండ్రులు ఆన్‌లైన్ విద్య కంటే తరగతి గదే మంచిదని అభిప్రాయపడుతున్నారని ఎస్పీ రోబోటిక్స్ వర్క్స్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story