PhD At 89 Years : PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు

PhD At 89 Years : PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు
తొలి సీనియర్​ గ్రాడ్యుయేట్​గా రికార్డు!

18 ఏళ్లకే చదువుపై నుంచి ఇంట్రెస్ట్ కోల్పోతున్న యూత్‌ను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో ఓ పెద్దాయన 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ (డాక్టరేట్​ ఇన్​ ఫిలాసఫీ) చేశారు. దీంతో మనదేశంలో తొమ్మిది పదుల వయసులో పీహెచ్‌డీ చేసిన తొలి సీనియర్​ గ్రాడ్యుయేట్​గా రికార్డును క్రియేట్ చేశారు. ఈ రికార్డును క్రియేట్ చేసిన పెద్దాయన పేరు మార్కండేయ దొడ్డమణి. కర్ణాటక వాస్తవ్యుడు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల పీహెచ్‌డీ పట్టా పొందానని ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని జయనగర్‌లో నివాసముంటున్న మార్కండేయ దొడ్డమణి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత సాహిత్య రంగంలో చాలాకాలం పాటు పనిచేశారు.

ధార్వాడ్‌లోని జయనగర్‌లో నివాసముంటున్న మార్కండేయ దొడ్డమణి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత సాహిత్య రంగంలో చాలాకాలం పాటు పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల పాటు శివశరణ్​ డోహర కక్కయ్య అనే వ్యక్తి రచించిన వచనాలు, ఆయన జీవిత చరిత్రపై పూర్తి అధ్యయనం చేశారు. అలా మార్కండేయకు కక్కయ్యకు సంబంధించిన వచన సాహిత్యంపై పీహెచ్​డీ చేయాలనే ఆలోచన వచ్చింది. కక్కయ్యకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుని మొత్తం 150 పేజీల థీసిస్​ను పూర్తి చేశారు దొడ్డమణి. ఇది వరకు కర్ణాటక విద్యా చరిత్రలో మలి వయసులో పీహెచ్​డీ పట్టా పొందిన ఓ 79 ఏళ్ల వృద్ధుడి రికార్డును బద్దలుగొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story