మణిపూర్ లో మరోసారి హింస, 9 మంది మృతి

మణిపూర్ లో మరోసారి హింస, 9 మంది మృతి
మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణలు

హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లోని ఖమెన్‌లాక్ ప్రాంతంలోని ఈ హింసాకాండ చెలరేగింది. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈస్ట్ ఇంపాల్ ఎస్పీ శివకాంత్ సింగ్ కథనం ప్రకారం, కొంతమంది వ్యక్తులు అత్యాధునికి ఆయుధాలతో ఇంఫాల్ ఈస్ట్ సరిహద్దు జిల్లాలోని ఖమెలాక్ ప్రాంతంలోని గ్రామస్థులను మంగళవారం అర్ధారాత్రి ఒంటిగంట ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

మెయితీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాకు, గిరిజన మెజారిటీ ఉన్న కాంగ్పోక్తి జిల్లాకు సరిహద్దు వెంబడి ఈ ఖమెలాక్ ప్రాంతం ఉంది. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి అంటూ ఇటీవల సడలించిన కర్ఫ్యూ ఆంక్షలను ఇప్పుడు తిరిగి అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం మణిపూర్‌లోని 16 జిల్లాలకు 11 జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఈ హింసాకాండ గురించి కుకీ మరియు మెయితీ కమ్యూనిటీల ప్రజల నుండి భిన్నమైన వాదనలు వస్తున్నాయి. తమ గ్రామంలో దాడి చేసింది మొయితీ వర్గానికి చెందిన వారే చేశారని కుకీ సంఘం ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లైసెన్స్ ఉన్న ఆయుధాలతో దుండగులను ఎదుర్కోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అధునాతన ఆయుధాలతో నిద్రపోతున్న సమయంలో కాల్పులు జరపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

మెయితీలకు ఎస్‌టీ హోదా కల్పించాలనే నిర్ణయంతో రాష్ట్రంలో గత మే 3న అల్లర్లు మొదలయ్యాయి. చురా చాంద్ పూర్, తదితర జిల్లాలో హింస చెలరేగి 115 మంది మరణించగా, 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. హింసాకాండ విస్తరించడంతో కేంద్ర బలగాలను మణిపూర్‌లో మోహరించి, మరోవైపు శాంతి చర్చలకోసం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చేరడం లేదని మెయితీ-కుకీ వర్గాల్లోని సివిల్ సొసైటీ సంస్థ సభ్యులు ఇటీవల ప్రకటించారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీలు ఉండగా, వీరు ఎక్కువగా ఇంఫాల్ వ్యాలీలో ఉంటున్నారు. గిరిజన నాగాలు, కులీల జనాభా 40 శాతం ఉండగా, వీరిలో ఎక్కువ మంది కొండప్రాంత జిల్లాల్లో నివసిస్తు్న్నారు.

Tags

Read MoreRead Less
Next Story