Karnataka: పాముకు ఎదురెళ్లిన తల్లి ప్రేమ.. కొడుకును కాపాడుకోవడం కోసం..

Karnataka: పాముకు ఎదురెళ్లిన తల్లి ప్రేమ.. కొడుకును కాపాడుకోవడం కోసం..
Karnataka: పడగెత్తిన తాచుపాము అడుగు దూరంలో ఉంటే.. ఇక అంతే సంగతులు… గుండెలు ఆగినంత పని అవుతుంది.

Karnataka: పామును చూస్తే ఎవరికైనా దడ పుట్టక మానదు. అలాంటిది పడగెత్తిన తాచుపాము అడుగు దూరంలో ఉంటే.. ఇక అంతే సంగతులు… గుండెలు ఆగినంత పని అవుతుంది. కానీ అంతటి టెన్షన్‌ లోనూ సమయస్ఫూర్తి ప్రదర్శించింది ఓ తల్లి. రెప్పపాటు కాలంలో స్పందించి.. కొడుకు ప్రాణాలు కాపాడుకుంది. కర్ణాటక జిల్లా మాండ్యా జిల్లాలో జరిగింది ఈ ఘటన.

వర్షం పడి వెలిసిన తర్వాత.. ఓ తల్లి, కొడుకు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. అంతలో మెట్ల కిందుగా ఓ నాగుపాము పాకుతూ వెళుతోంది. దాన్ని చూసుకోని అబ్బాయి.. మెట్టు దిగుతూ దాన్ని తాకుతూ ముందుకెళ్లాడు. దీంతో ఆ పాము అంతెత్తున పడగెత్తింది. భయంతో ఏమీ తోచని కుర్రాడు.. తల్లి వైపు వెళ్లబోగా.. కాటేసేందుకు పాము సిద్ధమైంది. ఇంతలో మెరుపువేగంతో స్పందించిన తల్లి బాబును దూరంగా లాగేసింది. ఇదంతా కేవలం 2 సెకన్ల వ్యవధిలోనే జరిగింది.

సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీత ఆదరణ వస్తోంది. ముఖ్యంగా తల్లి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ… వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఓ అటవీశాఖ అధికారి వర్షకాలంలో పాములు సురక్షిత ప్రాంతాలను వెతుక్కునే పనిలో ఉంటాయని.. అందుకే ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags

Read MoreRead Less
Next Story