AIADMK: ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై

AIADMK: ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై
AIADMK | తమిళనాడులో కమలం పార్టీకి ఎదురుదెబ్బ..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. NDA కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. NDA ,భాజపాతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేపీ మునుస్వామి ప్రకటించారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు.

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో అన్నాడీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు చెన్నైలో అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు సమావేశమయ్యారు. ఎన్డీయేతో, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి అధికారికంగా ప్రకటించారు.


ఏడాది కాలంగా భాజపా తమిళనాడు నాయకులు తమ పార్టీ కీలక నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శి , కార్యకర్తల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని మునుస్వామి పేర్కొన్నారు. భాజపా, NDAతో ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధాలు ఉండవని చెప్పారు. గత కొంత కాలంగా తమిళనాడులోని భాజపా, అన్నాడీఎంకే నేతల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో AIADMK తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేస్తోన్న ఆ పార్టీ శ్రేణులు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తొలిసారి స్పందించారు. అన్నాడీఎంకే నిర్ణయంపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను పాదయాత్ర చేస్తున్నానని... అన్నాడీఎంకే ప్రకటనను ఇప్పుడే చదివానని చెప్పారు. అన్నామలై పాదయాత్ర ప్రస్తుతం కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story