Actor Thalapathy Vijay: త్వరలో మరో హీరో కొత్త రాజకీయ పార్టీ

Actor Thalapathy Vijay: త్వరలో మరో హీరో కొత్త రాజకీయ పార్టీ
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం..

రాజకీయ రంగ ప్రవేశానికి తమిళనాడు చెందిన ప్రముఖ నటుడు విజయ్‌ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. గురువారం చెన్నైలో జరిగిన విజయ్‌ అభిమాన సంఘం ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వార్తలు రావడం గమనార్హం. ఒక నెలలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయ అరంగ్రేటంపై ప్రకటన చేశారు. కానీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల విజయ్ ఆ ప్రకటనపై అవునని కానీ కాదని కానీ స్పందించలేదు. కానీ గత కొంతకాలంగా దళపతి అడుగులన్నీ రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమనే సంకేతాలే ఇస్తున్నాయి. జనవరి 25 గురువారం నాడు చెన్నైలోని తన అభిమానలతో సమావేశం అయ్యారు విజయ్. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి దాదాపు 150 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి రాగా, తన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ అభిమాన సంఘంతో పాటు విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట కొత్త పార్టీని రిజిస్ట్రర్ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దళపతి విజయ్ అభిమానుల సమావేశం, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి విషయాలపై తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అవుతున్నాయి. దళపతి విజయ్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

వచ్చే నెల రోజుల్లో పార్టీకి సంబంధించిన అధికారిక లాంఛనాలు అన్నీ పూర్తి చేయాలని తన అభిమాన సంఘానికి విజయ్ సూచించినట్లు తెలుస్తోం ది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పార్టీ ఏర్పాటు ప్రకటన చేయాలని, రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని దళపతి వ్యూహంగా చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story