Aditya L-1: భూ గురుత్వాకర్షణ పరిధి దాటి...

Aditya L-1: భూ గురుత్వాకర్షణ పరిధి దాటి...
భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం పయనించిన ఆదిత్య ఎల్-1

సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం లక్ష్యంగా దిశగా దూసుకెళ్తోంది. వ్యోమనౌక భూమి నుంచి 9లక్షల 20 వేల కిలోమీటర్లు దాటినట్లు ఇస్రో ప్రకటించింది. భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విజయవంతంగా బయటపడినట్లు తెలిపింది. ఒక వ్యోమనౌక భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్లటం ఇది రెండోసారి అని ఇస్రో పేర్కొంది. మెుదట మార్స్ ఆర్బిటార్ మిషన్ ను విజయవంతంగా భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్లినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2న PSLV-C57 రాకెట్ ద్వారా ఇస్రో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ .... చుట్టు ఉన్న హలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌక ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహాన్ని చేర్చనుంది. ఈ ఉపగ్రహం సూర్యుని చుట్టూ సమాంతరంగా తిరుగుతుంది. అందులో ఏడు భిన్నమైన పేలోడ్ లలో...నాలుగు సూర్యుడిని అధ్యయనం చేయనుండగా.. మిగితా మూడు ప్లాస్మా, ఆయస్కాంత క్షేత్రాలను పరిశోధించనున్నాయి.


ఆదిత్య ఎల్-1 ఇప్పుడు భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రేంజ్ పాయింట్ 1 దిశగా వెళుతోందని వివరించింది. లెగ్రేంజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేపట్టేందుకు ఉపగ్రహాలకు అనువుగా ఉంటుంది. ఈ నెల 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని మోసుకుంటూ పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం తెలిసిందే. ఇస్రోకు నమ్మినబంటుగా పేరుగాంచిన పీఎస్ఎల్వీ రాకెట్ ఆదిత్య ఎల్-1 ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.


సూర్యుడి గుట్టు విప్పేందుకు, విస్తృత పరిశోధనలు చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సూర్యుడి దగ్గరికి గానీ.. దాని ఉపరితలంపైన గాని దిగడానికి వీలు లేదు. కేవలం భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు మాత్రమే ఆదిత్య ఎల్1 ప్రయాణించనుంది. అయితే ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం.. లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకునేందుకు 120 రోజుల సమయం పడుతుందని ఆ ప్రయోగం ప్రారంభించినపుడే ఇస్రో వెల్లడించింది. ఆ లాగ్రాంజ్ పాయింట్ 1 నుంచే అది ప్రయాణిస్తూ సూర్యుడి గురించి అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది. ఇక ఈ ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు దాని వెలుపల ఉండే కరోనాపై విస్తృత పరిశోధనలు చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి పరిశోధనలు జరపనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story