Earthquake: పంజాబ్‌ను వణికించిన భూకంపం

Earthquake:  పంజాబ్‌ను వణికించిన భూకంపం
కాశ్మీరులో కూడా

దేశంలోని పంజాబ్ రూప్‌నగర్‌ లో బుధవారం వేకువ జామున భూకంపం సంభవించింది, బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోనూ 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. నేపాల్, ఢిల్లీతోపాటు వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.


పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం వేకువ జామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటి వరకు ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చైనా దక్షిణ జిన్‌జియాంగ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్ట్‌ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ పేర్కొంది. భూమికి ఎనిమిది కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది.

జమ్మూకశ్మీరులోని కిష్టావర్ ప్రాంతంలో మంగళవారం భూకంపం వచ్చింది. మంగళవారం రాత్రి 6.52 గంటలకు భూమి కంపించింది. ఇటీవల కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్‌క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చరించారు. ఇటీవలి ప్రకంపనల తర్వాత నేపాల్‌లో పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్ దేశంతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత నాలుగురోజులుగా వరుస భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. 2015 నుంచి నేపాల్ దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం తాజాగా సంభవించింది. ఈ భూకంపం వల్ల 153 మంది మరణించిన కొద్ది రోజులకే, మరో స్వల్పంగా భూకంపం రావడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నవంబర్ 5 వతేదీన సంభవించిన భూకంపం వల్ల ఖాట్మండు, ఢిల్లీ వరకు కూడా కొండచరియలు విరిగిపడటం, ఇళ్ళు, రోడ్లు,మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ఆదివారం నాటి భూకంపం ఈ ప్రాంతంలోని అన్ని ఒత్తిడిని విడుదల చేసి ఉండకపోవచ్చని, మరింత పెద్ద,విధ్వంసక భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి నిరంతరం నెట్టడం, క్రస్ట్‌లో ఒత్తిడిని సృష్టించడం వల్ల భూకంపం సంభవించిందని చెప్పారు. ఒత్తిడి కాలక్రమేణా పేరుకుపోతుందని, దీనివల్ల క్రమానుగతంగా భూకంపాల రూపంలో విడుదలవుతుందని, అయితే ఆదివారం నాటి భూకంపం ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసిందని ఆయన చెప్పారు. 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సృష్టించడానికి తగినంత ఒత్తిడి ఉందని, అది ఎప్పుడైనా సంభవించవచ్చని అంచనా వేశారు.


Tags

Read MoreRead Less
Next Story