ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన గాలి కాలుష్యం.. నిన్న ఒక్కరోజే..

ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన గాలి కాలుష్యం.. నిన్న ఒక్కరోజే..
కాలుష్యం తగ్గించేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా ఢిల్లీలో పరిస్థితి మారలేదు. గాలి నాణ్యత లేని కారణంగా పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. శనివారం AQI ఇండెక్స్ 414గా చూపించింది..

కాలుష్యం తగ్గించేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా ఢిల్లీలో పరిస్థితి మారలేదు. గాలి నాణ్యత లేని కారణంగా పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. శనివారం AQI ఇండెక్స్ 414గా చూపించింది. శుక్రవారం 314గా ఉన్న AQI నిన్న దీపావళి సందర్భంగా ఒక్కసారిగా పెరిగింది. ఆనంద్ విహార్, RGI ఎయిర్‌పోర్టు ఏరియా, లోథిలోడ్ సహా పలు చోట్ల రికార్డు స్థాయిలో కాలుష్యం కనిపించింది. ఈ తరహా వాయుకాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అటు, ఈ కాలుష్యం కారణంగా పొగమంచు కూడా దట్టంగా కమ్మేయడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. 20 మీటర్ల ముందున్న వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు కనిపిస్తోంది. అటు, పెరిగిన వాయుకాలుష్యంతో కళ్లమంటలు, దగ్గు లాంటి లక్షణాలతో కొందరు ఆస్పత్రుల్లో చేరారు. కరోనా వైరస్ ఢిల్లీలని వణికిస్తున్న టైమ్‌లో.. కాలుష్యం నుంచి బయటపడేందుకు దీపావళి టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించినా, మరెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story