నేటి నుంచే గంగా పుష్కరాలు

నేటి నుంచే గంగా పుష్కరాలు

నేటి నుంచి గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గంగా పుష్కరం లేదా గంగా పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమై 3 మే 2023న ముగుస్తాయి. వైశాఖ శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమై వైశాఖ శుక్ల త్రయోదశి నాడు ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈ 12 రోజుల పుష్కర కాలంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం, కర్మకార్యాలు నిర్వహించడం, ఇతర ఆచారాలు పాటించడం ఎంతో పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుష్కరం అనేది మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు సంబంధించిన నదుల పండుగ. ఇది ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం జరుగుతుంది. నదిని పవిత్రంగా మార్చే శక్తి పుష్కరుడుకు ఉంటుందని నమ్మకం. పుష్కరుడు బృహస్పతితో కలిసి అశ్వినీ నక్షత్ర మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అన్ని పుష్కరాలలో గంగా పుష్కరాలు అత్యంత పవిత్రమైనవి. గంగను సుర నది అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది మూడులోకాల్లో ప్రవహించే పుణ్యనది. గంగా పుష్కరాలు గంగానదీ తీరం వెంబడి ఉండే పవిత్ర పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి, ఋషీకేశ్, అలహాబాద్లలో జరుగుతాయి. గంగా పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు

Next Story