DELHI FLOODS: ఢిల్లీలో మళ్లీ కుండపోత... ఆరా తీసిన ప్రధాని

DELHI FLOODS: ఢిల్లీలో మళ్లీ కుండపోత... ఆరా తీసిన ప్రధాని
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం.... భారీగా స్తంభించిన ట్రాఫిక్‌... ఆరా తీసిన ప్రధాని మోఢీ

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ భారీ వర్షం కురిసింది. కుండపోత వాన(Heavy rain)తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జన జీవనం మళ్లీ అస్తవ్యస్తమైంది. భారీ వర్షంతో వరద(Delhi Floods) గుప్పిట్లో ఉన్న ఢిల్లీ(national capital) మళ్లీ వరద గుప్పిట్లో చిక్కుకుంది. రాజ్‌ఘాట, ఎర్రకోట సహా చాలా ప్రాంతాలు ఇక జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ITO, రాజ్‌ఘాట్‌(Rajghat) సహా నగరంలోని కీలక ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా వరద నీరు(floodwaters) చేరడంతో ఇవాళ ఉదయం అనేక ప్రదేశాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌(Massive traffic) అయింది. రద్దీని చక్కదిద్దేందుకు 4,500 మంది ట్రాఫిక్ సిబ్బందిని ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారు. ఢిల్లీలో భారీ సరకు వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. నీటిని బయటకు పంపేందుకు పారిశుద్ధ్య కార్మికులు రాత్రంతా శ్రమించారని అధికారులు తెలిపారు. భారీ వర్షంతో వరదను బయటకు పంపేందుకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు.


మరోవైపు హర్యానా( Haryana) నుంచి వరద ఉద్ధృతి తగ్గడంతో యమునా నది శాంతిస్తోంది. ఈ ఉదయం 6 గంటలకు యమునా నది నీటి మట్టం(Yamuna's water level) 206. 14 మీటర్లకు తగ్గిందని కేంద్ర వాటర్‌ కమిషన్‌ వెల్లడించింది. గత వారం రోజులుగా యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం 208.66 మీటర్లకు చేరుకుంది. 1978లో 207.49 మీటర్ల గరిష్ట స్థాయిని ఇది అధిగమించింది. ఇప్పటికే సగం నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలావరకు వీధుల్లో ఇప్పటికీ మురుగునీరు నిలిచిఉంది. యమునా నది నీటిమట్టం తగ్గుతున్న వేళ మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ఢిల్లీ వాసుల్లో భయాందోళనలకు గురవుతున్నారు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.


యమునా నది నీటిమట్టం తగ్గినా ప్రమాదం మాత్రం పొంచే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Chief Minister Arvind Kejriwal) హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యమునా బ్యారేజీ ఐదు గేట్లను ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేజ్రీవాల్(Kejriwal) వివరించారు. నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని ఢిల్లీ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక సహాయక చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్ నడుం లోతు వరద నీటి నుంచి జనాలను, మూగ జీవాల్ని తరలించింది. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరట్‌ నుంచి ఢిల్లీకి రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను తరలించారు. వరద బాధితులకు ఆహారం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.


విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సహాయ చర్యల గురించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనాతో మాట్లాడారు. వరద సమస్యలను ఎదుర్కొనేందుకు అన్ని విధాల స‌హాయం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారని స‌క్సేనా తెలిపారు. అత్యవసరం కాని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశించింది.

ముకుంద్‌పూర్ చౌక్ ప్రాంతంలో వరద నీటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు బాలురు మునిగి చనిపోయారు. యమునా నది ప్రమాద స్థాయిని దాటిన తర్వాత ఢిల్లీలో నమోదైన తొలి మరణాలు ఇవే.

Tags

Read MoreRead Less
Next Story