Lok Sabha Amit Shah: కశ్మీర్ రెండు కొత్త బిల్లులు లోక్‌సభలో ఆమోదం

Lok Sabha  Amit Shah: కశ్మీర్ రెండు కొత్త బిల్లులు లోక్‌సభలో ఆమోదం
అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేసిన

70ఏళ్ల నుంచి హక్కులు కోల్పోయినవారికి న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు సంబంధించి 2బిల్లులు తెచ్చినట్లు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షా తెలిపారు. నిర్వాసితులైనవారు ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభలో తమవాణి వినిపించేందుకు ఈ బిల్లులు ఉపయోగపడుతాయన్నారు.

జమ్ముకశ్మీర్‌ శాసనసభ స్థానాలను 114కు పెంచుతూ ఒక బిల్లును, కశ్మీర్‌ పండిట్లకు రెండుస్థానాలు కేటాయిస్తూ ప్రవేశపెట్టిన మరో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కశ్మీర్‌లో 47, జమ్ములో 43, పీవోకేలో 24సీట్లు ఉంటాయన్న అమిత్‌ షా...కశ్మీర్ పండిట్లకు రెండు సీట్లు రిజర్వ్‌ చేసినట్లు తెలిపారు. లోక్‌సభలో ఈ బిల్లులపై జరిగిన చర్చకు అమిత్‌ షా సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఓటుబ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆరంభంలోనే ఉగ్రవాదాన్ని అణిచివేసి ఉంటే....పండిట్లు కశ్మీర్‌ లోయను వీడాల్సి వచ్చేది కాదని అమిత్‌ షా తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దేశంలో అంతర్భాగమన్న అమిత్‌ షా అందుకే 24 స్థానాలు రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించారు

కేంద్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో బుధవారం కశ్మీర్‌కి సంబంధించి రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2023 బిల్లును ప్రవేశపెట్టింది. ఈసందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్‌లో 46 సీట్లు ఉండగా వాటిని మరొకటి పెంచి 47 అసెంబ్లీ సీట్లు చేసినట్లు తెలిపారు. అటు జమ్మూలో కూడా 37 అసెంబ్లీ సీట్ల సంఖ్యకు మరో 7సీట్లను పెంచి 43కి చేసింది కేంద్రం. ఇక పీవోకేలో కూడా 24 సీట్లు రిజర్వ్ చేసినట్లుగా తెలిపారు. పండిట్‌లకు రెండు సీట్లను కేటాయించినట్లుగా అమిత్‌షా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story