Top

కేంద్రమంత్రిని కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు

కేంద్రమంత్రిని కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు
X

సేవ్‌ అమరావతి నినాదంతో జాతీయ పార్టీల మద్దతు కూడబెడుతున్నారు రాజధాని మహిళా జేఏసీ నేతలు. ఢిల్లీలో పర్యటిస్తున్న మహిళా జేఏసీ నేతలకు జాతీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు వస్తే కచ్చితంగా అమరావతికి మద్దతు ఇస్తామని దాదాపు అన్ని జాతీయ రాజకీయ పార్టీల నేతలు భరోసా ఇచ్చారు..

ఇవాళ కేంద్ర సమాజిక న్యాయ సాధికారత శాఖ సహాయమంత్రి రాందాస్‌ అథవాలేని కలిశారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు జేఏసీ నేతలు. వారి ఆవేదన విన్న మంత్రి సానుకూలంగా స్పందించారు. రాజధాని విషయంలో రైతుల డిమాండ్‌ న్యాయమైందే అన్నారు. రాజధానిగా అమరావతికే తన మద్దతు ఉంటుందని.. ఈ అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానని హామి ఇచ్చారని జేఏసీ నేతలు వెల్లడించారు.

Next Story

RELATED STORIES