Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా..
సర్ఫరాజ్‌ఖాన్ తండ్రికి గిఫ్ట్‌గా థార్

మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మాట నిలబెట్టుకున్నారు. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్‌కు థార్ కారును బహుమతిగా అందించారు. కుమారుడు క్రికెటర్‌గా ఎదిగేందుకు నౌషద్‌ ఎన్నో త్యాగాలు చేశారు. సర్ఫరాజ్ టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం తర్వాత నౌషద్‌కు థార్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. సర్ఫరాజ్‌పై బీసీసీఐ షేర్ చేసిన వీడియో చూసి కరిగిపోయిన ఆనంద్ మహీంద్రా థార్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా నౌషద్‌ ఖాన్‌కు థార్‌ కారును బహుమతిగా అందించారు.

2013లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్‌.. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదుటెస్టుల సిరీస్‌లో భాగంగా మూడోటెస్ట్‌ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్‌ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 62 పరుగులు చేసి రాణించాడు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆనంద్‌ మహీంద్రా సైతం సర్ఫరాజ్‌ ఆటతీరుకు ఫిదా అయ్యారు.

ఈ మేరకు సర్ఫరాజ్‌ తండ్రికి థార్‌ కారును బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్టులో సర్ఫరాజ్‌ను మహీంద్రా ప్రశంసిస్తూనే తన సందేశాన్ని చెప్పారు. ‘ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, ధైర్యం, సహనం. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది. స్పూర్తిదాయకమైన తండ్రిగా నౌషాద్ ఖాన్ ‘థార్’ కానుకగా స్వీకరిస్తే అదే నాకు ఆనందం.. దక్కిన గౌరవం’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. తాజాగా తాను ఇచ్చిన ప్రామిస్‌ను మహీంద్రా నిలబెట్టుకున్నారు.

రాజ్‌కోట్‌ టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో రోహిత్‌ శర్మ అవుట్‌ అయిన తర్వాత సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లను చీల్చిచెండాడు. సర్ఫరాజ్‌ క్రీజులోకి వచ్చిన సమయంలో రవీంద్ర జడేజా 84 పరుగుల వద్ద ఉండగా.. సర్ఫరాజ్‌ పెవిలియన్‌కు చేరే సమయంలో 99 పరుగులు చేశాడు. దాంతో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ ఎలా సాగిందో తెలుస్తుంది. సర్ఫరాజ్‌ కేవలం 48 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్నా 62 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు.

Tags

Read MoreRead Less
Next Story