Anantnag Encounter: కొన‌సాగుతున్న ఎన్‌కౌంట‌ర్‌..

Anantnag Encounter:  కొన‌సాగుతున్న ఎన్‌కౌంట‌ర్‌..
మరో జవాను దుర్మరణం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. భ‌ద్ర‌తా ద‌ళాలు ఇవాళ కూడా యాంటీ టెర్ర‌రిస్ట్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. కోకెర్‌నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో ద‌ళాలు మోహ‌రించాయి. అయితే శుక్ర‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో గాయ‌ప‌డ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్‌నాగ్ ఎన్‌కౌంట‌ర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కోకెర్‌నాగ్‌లో ఉగ్ర‌వాదులు దాచుకున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో.. బుధ‌వారం నుంచి అక్క‌డ ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఆ కాల్పుల్లో ఆర్మీకి చెందిన క‌మాండింగ్ ఆఫీస‌ర్‌, కంపెనీ క‌మాండ‌ర్‌, డీఎస్పీ మృతిచెందారు. క‌ల్న‌ల్ మ‌న్‌ప్రీత్ సింగ్‌, మేజ‌ర్ ఆశిశ్‌, డీఎస్పీ హుమాయున్ భ‌ట్ మృతిచెందిన‌వారిలో ఉన్నారు. మ‌న్‌ప్రీత్ సింగ్‌, ఆశిశ్ దోంచాక్ పార్దీవ‌దేహాల‌ను పానిప‌ట్‌లోని స్వ‌గ్రామానికి శుక్ర‌వార‌మే చేర్చారు.


జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న అనంతనాగ్ జిల్లాలో మంగళవారం రాత్రి మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ తెరిపిన పడలేదు. ల‌ష్క‌రే తోయిబాకు ప్ర‌త్యామ్నాయం అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర‌వాద ద‌ళ కాల్పుల‌కు తెగించిన‌ట్లు తెలుస్తోంది. గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆప‌రేష‌న్ ద్వారా ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు గాలింపు మొద‌లుపెట్టాయి. ఆర్మీ కల్నల్ సింగ్, మేజర్ ధ్యాంచెక్ తోపాటు జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ అధికారి హిమయూన్ భట్ ఉగ్రవాదుల కాల్పులతో తొలుత మరణించారు. దీంతో అప్పటి నుంచి జాయింట్ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో బాంబులను విడుస్తున్నారు. దట్టమైన అడవిలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. హీర‌న్ డ్రోన్ల‌తో పాటు క్వాడ్‌కాప్ట‌ర్ల‌ను .. నిఘా కోసం రంగంలోకి దింపారు.


శుక్రవారం భద్రతా బలగాలు తమ దాడిని మరింత తీవ్రతరం చేశాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు బాంబుల చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. మరోవైపు మరణించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధ్యాంచెక్ మృతదేహాలను శుక్రవారం ఉదయం పానిపట్ కు తరలించారు. డీఎస్పీ హుమయూన్ భట్ కు బుద్గాంలో తుది క్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల చేతుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా జమ్మూ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల్లో అమరుడైన మేజర్ ఆశిష్ ధోనక్​కు ఘనంగా వీడ్కోలు పలికారు.


తన స్వగ్రామమైన హరియాణాలోని బింజోల్‌లో బంధు మిత్రులు, గ్రామస్థుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మేజర్‌ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా నిల్చుని 'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు సైతం రోడ్డుకు ఇరువైపులా నిలబడి నినదించారు. అశిష్ ధోనక్ భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచిన సైన్యం గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.


Tags

Read MoreRead Less
Next Story