Kashmir: ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న భద్రతా దళాలు

Kashmir: ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌‍(Jammu and Kashmir )లో ఉగ్రవాదుల(terrorists)ను భద్రతా దళాలు( Army troops) ఏరి పారేస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. విధ్వంసమే లక్ష్యంగా చొరబాటు యత్నాలు చేస్తున్న ముష్కరులను హతమారుస్తున్నాయి. సరిహద్దుల వెంట నిఘాను పటిష్టం చేసిన భద్రతా దళాలు.. పాకిస్థాన్‌(pakisthan) నుంచి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న ఉగ్రమూకలకు చెక్‌ పెడుతున్నాయి.

పూంచ్‌ జిల్లా(Poonch district )లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు(terrorist was gunned down ). దేగ్వార్ సెక్టార్‌(Degwar sector )లో సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడుతున్న( terrorists attempting to sneak) ఉగ్రవాదిని భద్రతా దళాలు ఏరిపారేశాయి. తెల్లవారుజామున( cover of darkness) భారత్‌లో చొరబడేందుకు ఇద్దరు ముష్కరులు యత్నించారని.. అందులో ఒకడిని హతమార్చామని అధికారులు తెలిపారు. మరొకడు భయంతో పారిపోయాడని పోలీసులు తెలిపారు. పారిపోయిన రెండో ఉగ్రవాది కోసం పరిసరాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వాడిని పట్టుకునేందుకు ప్రత్యేక సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహస్తున్నాయి.


ఆదివారం కుప్వారా జిల్లాలోనూ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతాదళాలు భగ్నం చేశాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. కుప్వారా తంగ్‌ధర్ సెక్టార్‌లో సంయుక్త ఆపరేషన్ చేపట్టిన సైనికులు, పోలీసులు ముష్కరుల కదలికలను గుర్తించారు. నియంత్రణ రేఖ దాటి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకొని పాకిస్థాన్‌లోకి వెళ్లారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక ఏకే 47 రైఫిల్, ఏకే మ్యాగజైన్, 15 ఏకే రౌండ్లు, ఐదు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక 15 ఎంఎం పిస్టల్, ఎనిమిది పిస్టల్ మ్యాగజైన్లు, 9 ఎంఎం పిస్టల్, 32 బుల్లెట్లు ఉన్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు పాక్‌కు చెందిన తీవ్రవాద గ్రూపులు ప్లాన్ చేస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం( alert troops) చేశారు.

Tags

Read MoreRead Less
Next Story