Supreme Court: ఆ ఆర్టికల్‌ ప్రాథమిక హక్కులు హరించింది

Supreme Court: ఆ ఆర్టికల్‌ ప్రాథమిక హక్కులు హరించింది
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్య... ఆర్టికల్‌ 35 ఏ రాజ్యాంగ హక్కులను లాగేసుకుందన్న సీజేఐ

జమ్మూకశ్మీర్‌లో నివసించని ప్రజలకు(J&K Non-Residents ) ఆర్టికల్ 35ఏ(Article 35A) కొన్ని రాజ్యంగ హక్కులను దూరం చేసిందని( many fundamental rights of citizens) సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ డీవై చంద్రచూడ్( Chief Justice Chandrachud) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సమాన అవకాశాలు, ఉద్యోగం, భూమి కొనుగోలు చేసే హక్కు వంటివి ఈ ఆర్టికల్ లాగేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు ఉండడం వల్ల రాష్ట్రేతరులకు ఇవి అందకుండా పోయాయన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యంగం కంటే దేశ రాజ్యంగం గొప్పదని జస్టిస్‌ చంద్రచూడ్‌ తేల్చిచెప్పారు.

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగం( Constitution)లో చేర్చిన ఆర్టికల్ 35 A ప్రజలకు కనీసం మూడు ప్రాథమిక హక్కుల(constitutional rights )కు హామీ ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ సంజయ్ కృష్ణ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.


ఆర్టికల్ 370( Article 370)తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. అదే సమయంలో రాష్ట్రేతరులకు ఎలాంటి హక్కులు లేకుండా అడ్డుకున్నాయి. దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు పొందే అవకాశం(employment in the state government ) కల్పించే ఆర్టికల్ 16(1)( Article 16(1)), దేశంలో ఎక్కడైనా స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19 రెండింటినీ 35ఏ అధికరణ లాగేసుకుందని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు.

కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఎత్తివేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగ నిబంధన పూర్తిగా భిన్నమైన యంత్రాంగాన్ని సూచించడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story